28-09-2025 10:22:31 PM
నంగునూరు: నంగునూర్ మండలం తాత్కాలిక తహసిల్దార్‌గా పి. మాధవి నియమితులయ్యారు. ప్రస్తుతం నారాయణరావుపేటలో నాయిబ్ తహసిల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి. మాధవిని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు, నంగునూర్ మండలంలో పూర్తిస్థాయి తహసిల్దార్ పోస్టులో కొనసాగించడానికి జిల్లా కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంలో భాగంగా ఆమె ఆదివారం తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. కాగా, ఇంతకుముందు నంగునూరు తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన జి. సరిత ప్రస్తుతం మార్కాక్ మండలానికి బదిలీ అయ్యారు. నంగునూర్ మండల పరిపాలన వ్యవహారాలను ఇకపై పి. మాధవి పర్యవేక్షించనున్నారు.