28-09-2025 10:16:37 PM
కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస రెడ్డి..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని బేల మండలం మసాల(బి) గ్రామంలో ఆదివారం జరిగిన బతుకమ్మ సంబరాలలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి బతుకమ్మకు పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో గ్రామస్థుల్లో ఉత్సాహన్ని నింపారు. అంతకు ముందు గ్రామానికి చెందిన పలు సమమ్యలపై చర్చించారు. ఏసమస్య వచ్చినా గ్రామస్తులకు తాను అండగా ఉంటానని కంది శ్రీనివాస రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. బతుకమ్మ పండగ మన తెలంగాణ సంస్కృతికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, డైరెక్టర్ మడావి చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, నాయకులు రాందాస్ నాక్లే, సామా రూపేష్ రెడ్డి, ఠాక్రె అశోక్, ఘన్ శ్యామ్, విట్టల్ దేవతడే, నానాజీ పటేల్, ఠాక్రె అశోక్ పాటిల్, సుదాం రెడ్డి, బండి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.