calender_icon.png 1 May, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయాల బాటలో బీజేపీ

24-04-2025 12:32:18 AM

బీజేపీ రాష్ట్ర నాయకుడు తాండ్ర వినోద్ రావు

భద్రాచలం ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని  రాష్ట్ర అధ్యక్షులు  కిషన్ రెడ్డి  పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ చింతల చెరువు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు, గిరిజన మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కులాల్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ ఖండించిందని, వారి జీవితం మొత్తం అవమానాల మధ్య కొనసాగిందని అన్నారు.

అంబేద్కర్ ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం, ఆయనను పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడం, మరణానంతరం మర్యాదలు చేయకపోవడం వంటి అనేక ఉదాహరణలు వెల్లడించారు.ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అంబేద్కర్ సిద్ధాంతాలను గౌరవిస్తూ పలు పథకాలు అమలు చేస్తోందని వివరించారు. రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 26ను ప్రకటించడం, పంచ తీర్థాల అభివృద్ధి, భీమ్ యాప్ ప్రారంభించడం వంటి కార్యక్రమాల ద్వారా అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయమూర్తుల నియామకాల్లో సమానత పాటించడం, 33% మహిళల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం వంటి చర్యలు బీజేపీ కట్టుబాటును చాటుతున్నాయని అన్నారు.జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ప్రజలంతా ఏకతాటిపై ఉండాలని కోరారు. ప్రధానమంత్రి మోదీ ఉగ్రవాద నిర్మూలనకు దృడసంకల్పంతో ముందడుగు వేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కుంజా ధర్మ, జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డి,  కో కన్వీనర్ బాలరాజు, మెట్ట వెంకటేష్, భద్రాచలం మండల అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా నాయకులు నాగబాబు, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.