24-04-2025 12:31:29 AM
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెల్ల, ఏప్రిల్ 23:చేవెళ్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మున్సిపాలిటీ కోసం కొనుగోలు చేసిన రోడ్డు శుబ్రపరిచే యం త్రం , డోజర్ ను బుధవారం స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల మున్సిపాలిటీకి అత్యధిక నిధులు మంజూరు చేయించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని చేవెళ్ల, మల్కాపుర్, ఊరెళ్ల, రామన్నగూడ, దామరిగిద్ద, ఇబ్రహీం పల్లి, పల్గుట్ట, కందవాడ, పామెన, మల్లారెడ్డి గూడ, దేవుని ఎర్రవల్లి గ్రామాల్లో పెండింగ్ పనుల వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, చేవెళ్ల, ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నేతలు మర్పల్లి కృష్ణా రెడ్డి, రాంచంద్రయ్య గౌడ్, బక్కరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.