calender_icon.png 1 May, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి

24-04-2025 12:32:49 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. ఏప్రిల్ 23 (విజయక్రాంతి):భూ భారతి పోర్టల్ ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన జిల్లా లోని మద్దూరు మండలంలో నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సులలో  వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.

భూ భారతి ఫైలెట్ ప్రాజెక్టు మద్దూరు మండలంలోని గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో రైతుల నుంచి స్వీకరించిన సమ స్యల దరఖాస్తుల పరిశీలనకు కోస్గి, మద్దూరు మండలాల తహాసిల్దార్ల  నేతృ త్వంలోని రెవెన్యూ అధికారుల బృందం మద్దూరు తహాసిల్దార్  కార్యాలయంలో  సమస్యల వారీగా దరఖాస్తుల పేపర్ వర్క్ చేస్తున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మద్దూరు తహసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షించారు.      

ఈ కార్యక్రమంలో  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ప్రత్యేక అధికారి యాదగిరి, తహసిల్దార్లు బక్క శ్రీనివాస్, అనిల్ కుమార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.