26 April, 2026 | 2:24 AM

ఫుట్‌పాత్ తొలిగింపుపై బీజేపీ ఆగ్రహం

26-04-2026 12:00 AM

జడ్పీ రోడ్డులో ర్యాంప్‌లు, మెట్లను తొలిగించడం సరికాదు 

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వ్యక్తిగత ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని బీజేపీ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ అన్నారు. హస్తినాపురం డివిజన్‌లో ఉన్న జడ్పీ రోడ్డు లో ప్రజలు, వ్యాపార సముదాయాల యజమానులకు ఎటువంటి సమాచారం లేకుం డా జీహెచ్‌ఎంసీ అధికారులు ఇష్టానుసారంగా ర్యాంపులు, మెట్లను తొలిగించడం బాధాకరమన్నారు.

ఇప్పటికే జడ్పీరోడ్డులో వ్యాపారాలు,  హోటల్స్ నష్టాల్లో నడుస్తున్నాయని,  ఆక్రమణల కూల్చివేయడంతో నష్టాల్లోకి తోసి వేయబడ్డారని చెప్పారు. మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ నిర్మూలన కోసం తక్షణమే జడ్పీ రోడ్డులో నిర్వహిస్తున్న వారంతపు కూరగాయల సంతలను మెయి న్ రోడ్ నుంచి ప్రభుత్వ స్థలాలు, కాలనీల్లోకి మార్చాలని డిమాండ్ చేశారు.

ట్రాఫిక్ నివారణకు కంటే తుడుపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గౌని వెంకటేశ్ గౌడ్, మురళీధర్ రెడ్డి, కాలనీవాసులు కొంగర బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.