అక్రమంగా నిర్మించిన షెడ్ తొలగింపు
బోర్డ్ యువ ఇంజినీర్లు ఆధ్వర్యంలో కూల్చివేతలు
సికింద్రాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : కంటోన్మెంట్ సెంటర్ పాయింట్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన జయరాం లిక్కర్ మార్ట్ షాపు యజమాని అక్రమంగా నిర్మించిన పర్మట్ రూమ్ షెడ్‌ను కంటోన్మెంట్ బోర్డ్ అధికారులు కూల్చివేశారు. సెంటర్ పాయింట్‌లో జయరాం లిక్కర్ మార్ట్‌పై చుట్టుపక్కల కాలనీ వాసులు కంటోన్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశా రు.
దీంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చిన,షాప్ యజమానులు స్పందించకపోవడంతో అక్రమంగా నిర్మించిన షెడ్ తొలగిస్తున్న సమయంలో షాప్ యజమానులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటే చేసుకుంది. దీంతోపై అధికారులు ఆదేశాల మేరకు కొంత సమయం ఇచ్చిన తర్వాత పూర్తిగా అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చి వేశారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఇంజనీర్లు రాజేశ్వరరావు,జిష్ణు శ్రీనివాస్, తరుణ్‌రెడ్డి, కృష్ణ సాగర్, దినేష్, ఆదిత్య, కంటోన్మెంట్ డెమోలేషన్ సిబ్బంది, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పి.శంకర్,పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






