కౌశిక్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు
బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు హెచ్చరిక..
కరీంనగర్, మే7 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బిజెపి శ్రేణులు బగ్గుమన్నారు. గురువారం రోజున కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాబి ఆర్ ఎస్, బిజెపి శ్రేణుల మధ్య వాక్యుద్ధం జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బోయినపల్లి ప్రవీణ్ రావు అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు . కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే నాలుక చీరేస్తామని ఘాటుగా హెచ్చరించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కు ఇచ్చిన 48 గంటల వ్యవధి దగ్గర పడిందని , డ్రగ్ ట్రస్టులకు కేటీఆర్ భయపడుతున్నారనే విషయం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కేటీఆర్ కు, బిఆర్‌ఎస్ నేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన సవాల్ ను స్వీకరించే దమ్ము లేక, కౌశిక్ రెడ్డి తో అనవసర వ్యాఖ్యలు, రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు .పోలీస్ కమిషనర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతావు... కేంద్రమంత్రి బండి సంజయ్ పై పిచ్చి కూతలు కూస్తావు.... మాట్లాడేటప్పుడు సోయండి మాట్లాడుతున్నావా..? నీకు సంస్కారం ఉందా..? నువ్వు ఎమ్మెల్యే వా...? అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని , లేకపోతే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టనీయం... ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అని ఆయన ఈ సందర్భంగా తీవ్ర హెచ్చరిక చేశారు.






