ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ.. బీజేపీ
30-08-2024 03:20 PM
హైదరాబాద్: ప్రజలకు మంచి నాయకత్వం ఇచ్చేందుకు సహకరిస్తుంది.. సభ్యత్వ నమోదు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉపయోగపడుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలికిని పార్టీ.. బీజేపీ అన్నారు. బీజేపీలో చేరేందుకు ఎంతోమంది నాయకులు సభ్యత్వాలు నమోదు చేసుకున్నారని ఈటల తెలిపారు. అటు ఈరోజు నిర్వహించబడిన బీజేపీ మోర్చాలు, సెల్స్ సంయుక్త కార్యశాలలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కన్వీనర్ రామచందర్ రావు , పార్టీ ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్, కార్యదర్శి కొల్లి మాధవి, ఇతర నాయకులు పాల్గొన్నారు.






