ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
జహీరాబాద్, మే 2 : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని జాగో తెలంగాణ కన్వీనర్, మాజీ ఐఏఏస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్‌లో తెలంగాణజాగో, టీడీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య బస్సుయాత్ర ను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్లుగా అభివృద్ధిని విస్మరించి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీని పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దించాలన్నారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ. 12లక్షల కోట్లను వసూలు చేసి రాష్ట్రానికి నిధు లు ఖర్చు చేయలేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. జనాభలో మెజార్టీ స్థానంలో ఉన్న బీసీలకు మంచి జరి గే కుల జనగణ చేపట్టడం లేదన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రొఫెసర్ కె. లక్ష్మీనారయణ, పద్మజాషా, డీబీఎఫ్ శంకర్, జేవీ చలపతిరావు, గోవర్ధన్, రామ్, నిర్మల, పులి కల్పన, జనార్దన్, స్వరూప, రవికుమార్, మాసుద్, సురేశ్ పాల్గొన్నారు.




