2 April, 2026 | 7:49 PM

సుల్తానాబాద్ వార్డులలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభలు

02-04-2026 06:09 PM

సుల్తానాబాద్, (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 14 వార్డుల లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభలు బుధవారం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ రమేష్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు, ఈ సందర్భం గా   పలు సమస్యలపై గ్రామస్తులు ఆయా సభల్లో జరిగిన సమావేశం లో తెలియజేశారు.

అలాగే పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ కోసం పలువురు దరఖాస్తులు సమర్పించారు, సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామపంచాయతీలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభలు జరిగాయి, ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు , అధికారులు, గ్రామస్తులు పాల్గొని సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుండి  చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాల గురించి సభలో వివరించారు..