2 April, 2026 | 8:46 PM

వేసవి సెలవుల కోసం ధర్నా

03-05-2024 12:33 AM

మేడ్చల్, మే 2 (విజయక్రాంతి): కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) విద్యార్థులు వేసవి సెలవులు ప్రకటించాలని ప్రొటెక్షన్‌ఫోర్స్ ఆధ్వర్యంలో గురువారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కారణంగా సెలవులతో పాటు చల్లటి నీటి వసతి కల్పించాలని కోరారు. స్పందించిన వీసీ కట్టా నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు మే 5వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ జీవీ నర్సింహరెడ్డి ప్రకటించారు. అదే సమయంలో చల్లటి నీటి వసతి కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడం తో ధర్నాను విరమించారు.