5,77,20,000 ఏప్రిల్ నెలలో మద్యం ప్రియులు తాగిన బీర్ల సంఖ్య ఇది
రాష్ట్రంలో ఎండలతో పాటు కలిసి వచ్చిన ఎన్నికలు
గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే 13.7% పెరుగుదల
మే నెలలో బీర్ల అమ్మకాలు మరింత పెరిగే ఛాన్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీర్ల అమ్మ కాలు రికార్డు సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మద్యం ప్రియులు ఒక్క ఏప్రిల్ నెలలోనే 5,77,20,000 (ఐదు కోట్ల డ్బ్బు ఏడు లక్షల ఇరవై వేల)బీర్లను లాగించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో 42.54 లక్షల కేసుల బీర్లు అమ్ము డవగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 48.10లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2023 ఏప్రిల్‌తో పోల్చితే 2024 ఏప్రిల్‌లో 13.7శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఒక్క రోజుకి గరిష్టంగా 21 లక్షల బీర్ల అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఫుల్ డిమాండ్ ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
అయితే 2024 మే నెలలో బీర్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. బీర్ల అమ్మకాలు పెరగడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం కూడా భారీగా చేరు తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఎండలు మం డుతుండటంతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు ప్రతిరోజు సాయంత్రం మద్యం, విందులను ఏర్పాటు చేస్తుండటంతో మందు బాబులు చల్ల చల్లని బీర్లను పొంగిస్తున్నారని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అలాగే పెళ్లిళ్లు, ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా బీర్ల అమ్మకాల పెరుగుదలకు ఓ కారణం అని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ని యువత పబ్బుల్లో కాలక్షేపం చేస్తూ, ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షిస్తూ, వీకెండ్‌లు ఎంజాయ్ చేస్తూ బీర్లను పొంగిస్తున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు.. చాలా వైన్స్‌లలో బీర్లు లేవని ‘నో స్టాక్’ బోర్డులు పెడుతున్నారని మందు బాబులు వాపోతున్నారు.
8 గంటల్లోపే నోస్టాక్
గతేడాదితో పోల్చితే ఈసారి బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. రాత్రి 8గంటల వరకు వైన్స్‌లలో బీర్లు అన్నీ అమ్ముడవుతున్నాయి. అబ్కారీ శాఖ డిమాండ్‌కి సరిపడా బీర్లు సరఫరా చేస్తున్నా వేసవి నేపథ్యంలో తాగేవారు పెరగడంతో బీర్ల అమ్మకాలు పెరిగాయి.
వైన్ షాప్
నిర్వహకుడు, బర్కత్‌పుర




