2 April, 2026 | 7:56 PM

మహమ్మాయి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

02-04-2026 06:21 PM

నిర్వహించిన ప్రభుత్వ విప్  విజయ రమణారావు....

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మహమ్మాయి దేవి అమ్మవారి బ్రహ్మోత్సవముల సందర్బంగా గురువారం  స్థానిక నాయకులతో కలిసి  ప్రభుత్వవిప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణా రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్  కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయరమణా రావు ని ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, గ్రామ సర్పంచ్ ఏరుకొండ స్రవంతి, రమేష్ గౌడ్ , కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న ), దేవరకొండ శ్రీధర చార్యులు, చిలుమోజు వీరాచారి ,  కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు...