2 April, 2026 | 8:12 PM

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

02-04-2026 06:24 PM

డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్....     

నిజాంసాగర్,(విజయక్రాంతి): రైతులను రాజులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ పేర్కొన్నారు. ఆయన గురువారం నాడు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ధాన్యం కొలువును కేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట సర్పంచ్  సంకు లక్ష్మయ్య , నాయకులు మంద బలరాం, బంగ్లా ప్రవీణ్, గఫూర్, ప్రసాద్, రాజు, రాములు, సొసైటీ కార్యదర్శి సంగమేశ్వర్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.