7 July, 2026 | 7:31 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

బీజేపీ పగ్గాలు బీసీలకే ఇవ్వాలి

30-06-2025 02:38 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాద్ సిటీ బ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): త్వరలో ప్రకటించబోయే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకే అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో ఆ పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించి,

ఎన్నికల తర్వాత బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తికి అవకాశం కల్పించిందన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కూడా అగ్రకుల సామాజిక వర్గ వారికే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పిందని, ఇప్పటికైనా బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు.

ప్రస్తుతం బీసీల్లో రాజకీయ చైతన్యం రోజురోజుకు గ్రామస్థాయి వరకు పెరిగిన విషయాన్ని బీజేపీ అధిష్ఠానం ఆలోచించాలని సూచించారు. భవిష్యత్తు లో తాము అధికారంలోకి వస్తే బీసీ ని ముఖ్యమంత్రిని చేస్తామనే సంకే తం బీసీలకు ఇవ్వాలని జాజుల శ్రీని వాస్ గౌడ్ కోరారు.