8 May, 2026 | 7:57 PM

డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

30-06-2025 02:39 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ మంచినీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గం లోని అడిక్మెట్ డివిజన్ సాయి మోహన్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్స్ వాసుల వినతి మేరకు  ఆదివారం డ్రైనేజీ, మంచినీరు, కరెంటు సమస్యలను తొందరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా  నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అపార్ట్మెంట్ వాసులను కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహ, అడిక్మెట్ కార్యదర్శి సురేందర్, మాధవ్, ఖదీర్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, యునిస్, అపార్ట్మెంట్ వాసులు మారుతీ రావు, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.