calender_icon.png 16 October, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత బీజేపీ వహించాలి

15-10-2025 08:47:16 PM

హుజూర్ నగర్ (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ కుల గణన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం అమలు చేసే బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బీసీ రిజర్వేషన్లు బిల్లును రాష్ట్ర గవర్నర్ వెంటనే ఆమోదించి అమల్లోకి తీసుకురావాలని సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల18న తలపెట్టిన బంద్ ఫర్ జస్టిస్ కి సిపిఐ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని తెలిపారు.

బీసీ బిల్లుపై బీజేపీ విధానాన్ని స్పష్టం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు.సామాజిక న్యాయం అందుబాటులోకి రావాలి అంటే బీసీ రిజర్వేషన్లు అమలు కావాల్సిందే అన్నారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి,యల్లవుల రమేష్, మామిడి వెంకయ్య,చేన్న గాని సైదులు,మామిడి నరసయ్య, ఇందిరాల వెంకటేశ్వర్లు,గుంజ సీతారాములు,బత్తిని మల్లయ్య, బత్తిని ప్రసాద్, పుల్లయ్య, శ్రీనివాస్,తదితరులు, పాల్గొన్నారు.