calender_icon.png 22 July, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలి

22-07-2025 12:00:00 AM

భద్రాచలం, జులై 21, (విజయ క్రాంతి):తెలంగాణ రాష్ట్రంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త గెలుపు లక్ష్యం గా పనిచేయాలని జిల్లా బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం భద్రాచలంలోని కుంజాధర్మ ఇంటి ఆవరణలో మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రాచలం ని యోజకవర్గం ఎన్నికల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్ర భాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మంజూరు చేస్తున్న ని ధుల వివరాలను ప్రజలకు వివరించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న వి షయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కౌన్సి ల్ సభ్యులు కుంజా ధర్మారావు త్రినా ధ రావు జిల్లా నాయకులు జల్లారపు శ్రీనివాస్ పసుమర్తి సతీష్ నిడదవోలు నాగ బాబు కేశవ్ మలిశెట్టి రామ్మోహన్రావు ఆవు ల సుబ్బారావు బొడా సత్యనారాయణ చక్రవర్తి తో పాటు పలువురు పాల్గొన్నారు