22-07-2025 12:00:00 AM
మున్సిపల్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
కబ్జాల్లో నాలాలు.. డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు
పట్టించుకోనిఅధికారులు
మణుగూరు, జులై 21( విజయ క్రాంతి ) : పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రజలకు సరైన మౌలిక వసతులు మాత్రం సమకూరడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలతో చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థ అస్త వ్యస్తంగా మారింది.
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ప్రజలు నరక యాతన పడుతున్నారు. మున్సిపాలిటీలోపారిశుధ్య నిర్వహణ ప్రస్తుతం అస్త వ్యస్తంగా మారింది. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించ కపోవడంతో వర్షం కురిసిన ప్పుడు నీ రు సక్రమంగా వెళ్లక రహదారుల పైకి చేరుతుంది.కొద్దిపాటి వర్షానికి వీధులు జలమ యం అవుతున్నాయి.
మణుగూరు వీధులు.. వానొస్తే వాగులుచిన్నపాటి వర్షం కురిస్తే పట్టణంలో వీధులు వాగుల ను తలపిస్తున్నాయి. అంబేద్కర్ కూ డలీ,పాత పెట్రోల్ బంక్, వేణు రెస్టారెంట్, ద్వారక హోటల్, తదితర ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. రోడ్డుపై భారీగా నీ రు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
మరోవైపు భారీవర్షం కురిసి నప్పుడల్లా బాలాజీ నగర్, సుం దరయ్య నగర్, గాంధీనగర్, తదితర ప్రాం తాల్లో వరద నీరు ఇళ్ల ల్లోకి చేరుతుంది. డ్రైనేజీ వ్యవస్థ లోపమే దీనికి కార ణం అనేది అధికారులకు తెలియనిదేమి కాదు. కొందరు ఇళ్ల నిర్మాణం కోసం డ్రైనేజీలపై ఇసుక, కంకర పోస్తున్నారు. అలాగే చె త్తాచెదారం,ప్లాస్టిక్ వ్యర్ధాలు వేస్తున్నారు. ఇది కూడా వర్షాల సమయం లో వరద నీరు చేరడానికి కారణంగా కనిపిస్తుంది.
మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంమూడేళ్ల క్రి తం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి సురక్ష బస్టాండ్ వరకు ప్రధాన రహదారికి ఇరువై పులా డ్రైనేజీనిర్మాణాలను చేపట్టారు. ఆక్రమణలు తొలగించకుం డానే డ్రైనేజీలు కట్టి కాలనీలలోని మురుగు నీటిని ప్రధాన డ్రైనేజీ లను కలుపుతన్నారు. డ్రైనేజీ లలో చె త్తా చెదారం, పూడికతీత చేపట్టక పోవ డం తో నీటి ప్రవాహం ఎక్కువై వర్షం నీరు రో డ్డు పైకి, ఇండ్లలోకి వస్తోంది.
మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుధ్య సమస్యతో పాటు కొద్దిపాటి వర్షానికే వీధులు వాగులను తలపిస్తున్న పరిస్థితి నెలకొన్నది.రోడ్లపై నే పారుతున్న వరద నీరు కొద్దిపాటి వాన పడిందం టే చాలు పట్టణంలో వరద నీరు రోడ్లపై ప్ర వహిస్తోంది. పలు కాలనీల్లోకి వరద నీరు ముంచెత్తుతుంది.డ్రెయినేజీలు సక్రమంగా లేక కాలనీ లు జలదిగ్భందంలో చిక్కుకుం టున్నాయి.
సోమవారం మధ్యాహ్నం గంటపాటు ఏకధాటిగా కురిసినవర్షానికి మణు గూరు పట్ట ణం అస్తవ్య స్తంగా మారి పోయింది. లోత ట్టు ప్రాంతాలు జలమయంగా మారా యి. సింగరేణి నుండి వచ్చే వరద నీరుతో గాంధీనగర్ ప్రాంతం జలమయ మైంది. పలు ఇళ్ల లోకి నీరు చేరింది. దీంతో ప్రజలకు ఇబ్బం దు లను ఎదుర్కొన్నారు. మరో వైపు మెయి న్ రోడ్ల వెంట సరైన డ్రైనే జీలు లేక రోడ్లపైనే నీరు పారాయి.
మరి కొ న్ని చోట్ల చిన్నగా ఉన్న డ్రైనేజీలు, వాటిపైనే కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేయడంతో వరద నీరు రహదారిపైకే వస్తోంది. దీంతో భారీ వర్షాలు కురి సిన ప్రతీసారి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అయిన ప్పటికీ యంత్రాం గం మాత్రం వరద సమస్య పరిష్కా రంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. మెయిన్ రోడ్లు, పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచి రాకపోకలు స్థం భించాయి. ఇండ్లలోకి వర్షపు నీరు రావటం తో జనం ఇబ్బందిపడ్డారు. భారీ వర్ష మే కా కుండా చిన్నపాటి వర్షం కురిసినా ఇదే పరిస్థితి పట్టణంలోసర్వసాధారణంగా మారింది.
ఏళ్లుగా సమస్య.. పరిష్కారం మాత్రం శూన్యం
మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం వరద నీటి సమస్య పరిష్కారానికి మాత్రం అధికారులు చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రద ర్శి స్తున్నారనే విమర్శలు ఉన్నాయి . దింతో పట్టణంలో అరగంట పాటు వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో మోకాలి లోతులో వరదనీరు నిలుస్తోంది. అయినప్పటికీ.. అధికా రుల చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి.
ఈ సీజన్ లో కూడా తమకు వరద నీటితో ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆ వేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా డ్రైనేజ్, వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెత్తా చెదారాన్ని, ప్లాస్టిక్ హెచ్ వ్యర్ధా లను తొలగించి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం చర్యలు చేపడతాం, డ్రైనేజీ, మురుగు, వర్షపు నీరు, లేకుండా చూస్తాం.
ప్రసాద్ మున్సిపల్ కమిషనర్