calender_icon.png 22 July, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది నాయకుల ఎన్నిక కాదు.. కార్యకర్తల ఎన్నిక

22-07-2025 12:00:00 AM

  1. ప్రతి గ్రామాన్ని బీజేపీ కోటగా మార్చండి

రుణమాఫీ మాయ, పల్లె ప్రగతి గాలిమాట

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

ఖమ్మం, జూలై 21(విజయ క్రాంతి):రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఛాలెంజ్గా తీసుకొని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పా ర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలో బీజే పీ నిర్వహించిన ప్రత్యేక కార్యశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఇది నాయకుల ఎన్నిక కాదు, కార్యకర్తల ఎన్నిక అని, గ్రామ అభివృద్ధికి నిధులు వచ్చేది మన ప్రభుత్వాల నుంచే అని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయిలో ప్రతీ స్థానంలో బీజేపీ పోటీచేయాలని, ప్రతి ఓటు జాతీయ అభివృద్ధికి పునాదిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.కాంగ్రెస్ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లండన్నారు.

గత రెం డేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామీణ పాలన పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చే యకపోతే గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది అని గుర్తు చేశారు.ప్రతి గ్రామానికి వెళ్లి, ఇంటింటికీ చేరి మోదీ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.

కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ కేవలం మాటల్లోనే మిగి లిపోయిందని అన్నారు.ఈ కార్యశాలలో జిల్లా కన్వీనర్ ఇవి రమేష్,రాష్ట్ర నాయకులు గెంటాల విద్యాసాగర్ రావు, దొంగలు సత్యనారాయణ, సన్నీ ఉదయ్ ప్రతాప్,దేవికి వాసుదేవరావు,దిద్దుకూరి వెంకటేశ్వరావు,నున్నా రవి,

నంబూరి రామలింగేశ్వరరావు, పుల్లారావు యాదవ్, సుదర్శన్ మిశ్రా, నలగట్టు ప్రవీణ్, నెల్లూరి బెనర్జీ, రాజేష్ గుప్తా, వేల్పుల సుధాకర్,వీరవెల్లి రాజేష్ విజయ రెడ్డి, నకరీకంటే వీరభద్రం, పమ్మి అనిత, టి. రవీంద్రనాథ్, పాలేపు రాము, కొమిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రవీంద్రనాథ్, రుద్రగాని మాధవ్ తదితరులుపాల్గొన్నారు.