calender_icon.png 22 February, 2026 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టు

22-02-2026 01:19:51 PM

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు ఆదివారం అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటివల ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బాన్సువాడ వెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దమయ్యారు. తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసినప్పటికి వెళ్లేందుకు యత్నించడంతో అరెస్టు చేశారు. దీంతో తార్నాకలోని రామచందర్ రావు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామచందర్ రావును అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపలోకి తీసుకున్నారు.  

ఈ సంరద్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని సంఘటితం కానివ్వకుండా కాంగ్రెస్ కపట రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు హిందువులను కాపాడరు, హిందువులకు అండగా నిలువరు. హిందూ సమాజానికి అండగా నిలిచే వారిని అడ్డుకుంటారు. అన్యమతస్తుల చేత హిందూ మహిళ వేధించబడిందని తెలుసుకొని, తనకి భరోసా కల్పించేందుకు బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అడ్డుకొని, అరెస్టు చేసి నిర్బంధించిందని మండిపడ్డారు.

బీజేపీ - హిందూ సంఘాల నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేసినందుకు, స్వయంగా వెళ్ళి వారికి మద్దతు ఇవ్వడానికి బాన్సువాడకు బయలుదేరిన రాంచందర్ రావుని అడ్డుకోవడం వెనక కాంగ్రెస్ పిరికితనం, హిందూ సమాజాన్ని అణచివేయాలనే ఉద్దేశం స్పష్టమవుతుందన్నారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ గూండాల దాడికి దిగితే కనీసం పరామర్శించే వీలు లేకుండా, ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి... ఎక్కడ బీజేపీ నాయకుల నేతృత్వంలో ప్రజలు ఏకమై తమ ప్రభుత్వం పునాదులు కుదిపేస్తారన్న భయంతో పకడ్బందీగా బిజెపి నాయకులను అడ్డుకొని కాషాయ సైన్యాన్ని ఆపుతాం అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వమే అవుతుంది.