ఆరు గ్యారెంటీల పేరుతో మోసం
అబద్ధాల హస్తాన్ని తరిమికొట్టాలి
10న ప్రధాని మోదీ సభను జయప్రదం చేయాలి
మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
రామాయంపేట, మే 2: ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను వంచించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మెద క్ ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం హామీలు ఇప్పుడు అబద్ధాల హస్తంగా మారాయని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తా మన్న మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ అందక రాష్ట్రం లోని రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
యువతకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పిందని ఆయన ఆరోపించారు. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నట్లు రాంచందర్‌రావు వెల్లడించారు. ఈ పర్య టనలో భాగంగా సుమారు రూ.7,800 కోట్ల వి లువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. వరంగల్‌లోని మామ్నూర్ విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేయడం తో పాటు, ఎంతో కాలంగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
పరేడ్ గ్రౌండ్ మోదీ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగి రాములు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి పంజా విజయ్ కుమార్, జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కౌన్సిలర్ జంగంపల్లి శంకర్‌గౌడ్, మండల బిజెపి అధ్యక్షుడు, లక్ష్మాపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్, సర్పంచులు బక్కయ్య గారి యాదగిరి, ఆకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.






