22 March, 2026 | 2:00 AM

గ్రేటర్‌పై బీజేపీ గురి

22-03-2026 12:37 AM

గెలుపే లక్ష్యంగా స్థానిక సమస్యలపై పోరుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు దిశానిర్దేశం

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌పై బీజేపీ దృ ష్టి సారించింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ గార్డెన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులతోపాటు ముఖ్యనాయకులతో శనివారం స మావేశమయ్యారు.

ఈ కార్యక్రమానికి కేం ద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు రాంచందర్‌రావు పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మూడు కార్పొరేషన్లలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్ణయాలు, కార్పొరేషన్ ఎన్నికలపై మాట్లాడినట్లు తెలిసింది. జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా చేసిన నేపథ్యంలో డివిజన్లు భారీగా పెరిగాయని, దీంతో స్థానికంగా డివిజన్ కమిటీలను నియమించుకోవాలని నాయకులకు ఆయన సూచించారు.

స్థానికంగా ఉండే ప్రజా సమస్యలపై నేతలు పోరాటం చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వాటిని పరిష్కరించేలా కార్యాచరణతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్య పోరాటంలో నాయకులు చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. దీంతోపాటు కాంగ్రెస్ అసమర్థ పాలనపై ఈనెల 23న చేపట్టబోయే అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని, ఇందుకు కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని రాంచందర్ రావు దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది.