31 March, 2026 | 2:19 AM

బీజేపీ 400 స్థానాలు సాధిస్తుంది

03-05-2024 01:57 AM

ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గొడం నగేశ్

ఆదిలాబాద్, మే 2 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ప్రచారంలో దూసు కుపోతోంది. ఆదిలాబాద్ అభ్యర్థి గొడం నగేశ్ జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం జైనథ్, బేల మండలాల్లో రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించారు. ముందుగా జైనథ్ లోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పూజలు జరిపారు. ఈ సందర్భంగా గోడం నగేశ్ మాట్లాడుతూ.. కేంద్రంలో 400కు పైగా స్థానాల్లో విజయం సాధించి మోదీ మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని ఆశా భావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం మోదీని మరోసారి ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.