calender_icon.png 16 September, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నేషనల్ హెరాల్డ్ కేసుపై బీజేపీ యువ మోర్చా ఆందోళన

17-04-2025 02:12:07 PM

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం(Tank Bund Ambedkar Statue) వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బీజేవైఎం నాయకులు(BJYM leaders) ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకు దిగారు. యంగ్ ఇండియా(Young India) పేరిట కాంగ్రెస్ లూటీని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. రాజ్యాంగం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మోకరిల్లాల్సిందేనని యువ మోర్చా పేర్కొంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్డ్ వాద్రా, శామ్ పిట్రోడా ఆస్తులు జప్తు చేయాలని యవ మోర్చా డిమాండ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.