calender_icon.png 5 May, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

05-05-2025 02:00:16 AM

తుర్కయంజాల్, మే 4: దేశంలో బీజేపీ చేస్తున్న మోసాలను జై బాపు,  జై భీమ్,  జై సంవిధాన్ కార్యక్రమంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తనయుడు మల్రెడ్డి అభిషేక్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరి ధిలోని 10, 11, 12 వార్డుల్లో జై బాపు, జై భీ మ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అభిషేక్రెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణా నికి అపార సేవలందించిన మహనీయులను బీజేపీ తక్కువ చేసి చూపడం శోచనీ యమన్నారు.

సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ను అమిత్షా అవమానించారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని కూడా బీజేపీ కించపరుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ జీ కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండ్లపల్లి ధన్రాజ్గౌడ్, కొశికె ఐలయ్య, మంఖాల దాసు, సామ భీం రెడ్డి, కాకుమాను సునీల్, మేతరి అనురాధ దర్శన్, గుండా భాగ్యమ్మ ధన్రాజ్, పుల్లగు ర్రం కీర్తనావిజయానంద్రెడ్డి, మర్రి మాధవి మహేందర్రెడ్డి, బింగి దేవదాసుగౌడ్, కుతుబ్ అలీ, గుడ్ల తిరుమలేశ్, గుడ్ల అర్జున్, ము త్యాల రాజశేఖర్, ఎన్ను భరత్ రెడ్డి, శ్రీకాంత్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.