05-05-2025 01:57:36 AM
తుర్కయంజాల్, మే 4: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ సాయినా థ్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. గతంలో వేసిన తాగునీటి పైప్లైన్ శిథిలావస్థకు చేరుకున్నదని నూతనంగా వాటర్ లైన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
అలాగే రోడ్ల కోసం నిధులు మంజూరు అ యినా పనులు సాగడం లేదని, వెంటనే పనులు జరిగేలా చూడాలని విన్నవించారు. స్థానికుల సమస్యలు విన్న ఎమ్మెల్యే రంగారెడ్డి త్వరితగతిన పనులు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.