17 April, 2026 | 2:47 AM

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం

17-04-2026 12:55 AM

తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాల్సిందే

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే తారకరామారావు

ఎంపీలు మౌనంగా ఉండటంపై ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై ఏ మాత్రం గౌరవం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇ లాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండి స్తున్నామని మండిపడ్డారు. ప్రధాని మోదీ నుంచి తేజస్వి సూర్య వరకు ప్రతిఒక్కరూ తెలంగాణ వ్యతిరేకతను చాటుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటుపై విషం గక్కుతు న్న బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పా టు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని ఆయన గుర్తు చేశారు. దేశ విభజనతో పోల్చడంతో బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు.

తెలంగాణ ప్రజల మనోభావా లను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు. 8 మంఇ ఎంపీలు మౌనం గా ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే వీరికి ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బీజేపీ అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందని కేటీఆర్ అన్నారు.