ఇప్పటివరకు వరకు ఐదుగురే..ఇక నుండి ఆరుగురు
కరీంనగర్, ఏప్రిల్16(విజయక్రాంతి):భారత ప్రజాస్వామ్య చరిత్రలో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఒక చరిత్రాత్మక మలుపు. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, అబలలు సబలలుగా మారి, దేశ విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యే సరికొత్త నవశకానికి నాంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
అయితే, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో మాత్రం దశాబ్దాలుగా నామమాత్రంగానే ఉండిపోయింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రవేశించింది ఐదుగు రే
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే ఉమ్మడి జిల్లా నుండి అరుగురికిఅవకాశందక్కుతుంది. ప ఒక సుదీర్ఘ పోరాటం. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారనున్నది. ఈ అసమానతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడం ఖాయం.
ఇప్పటి వరకు వీరే....
ఎం.రాజమణిదేవి భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 1952లో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై హైదరాబాదు రాష్ట్ర శాసనసభా సభ్యురాలైంది.ఈమె ఉమ్మడి జిల్లా నుండి ఎన్నికయిన మొదటి మహిళ ఎమ్మెల్యే.కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్ (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ప్రేమలతా దేవి 1957లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె కరీంనగర్ కౌన్సిలర్గా, రెండేళ్లు ఇన్ఛార్జి ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో పోటీ చేసిన 49 మంది
మహిళల్లో ఆమె ఒక్కరే విజయం సాధించారు.డాక్టర్ చెల్లమల్ల సుగుణ కుమారి
1998లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి 12వ లోక్సభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది. ఆ తరువాత 2004 రెండవసారి అదే నియోజకవర్గం నుండి 13వ లోక్సభకు ఎన్నికయ్యింది.పెట్రోలియం, రసాయనాలు, ప్రభుత్వ హామీలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖపై వివిధ పార్లమెంటరీ కమిటీలలో ఆమె సభ్యురాలిగా పనిచేశారు.
కొమిరెడ్డి జ్యోతి తన భర్త కొమిరెడ్డి రాములు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1994లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెట్పల్లి మండలం వెంకటరావుపేట్ ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీగా పని చేసింది. ఆమె 1994లో మెట్పల్లి ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని విద్యాసాగర్రావు 1998 లో ఎంపీగా గెలవడంతో అయన ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.
కొమిరెడ్డి జ్యోతి కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో ఆందోళనలు చేసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుండి మన్ననలు అందుకొని ఆలిండియా మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్ నాయకురాలిగా నియమితురాలైంది. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్తో ఆమె అనేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు.బోడిగే శోభ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
ఆమె స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి శంకరపట్నం మండలం నుండి జెడ్.పి.టి.సి సభ్యురాలిగా ఎన్నికయ్యారు . ఆమె ఏ.బి.సి వర్గీకరణ కోసం జరిగిన మాదిగ దండోరా ఉద్యమం మరియు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత 2009లో ఆమె చొప్పదండి నియోజకవర్గానికి టి.ఆర్.ఎస్ పార్టీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు . ఆమె 2014 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో చొప్పదండి నియోజకవర్గం నుండి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సుద్దాల దేవయ్యను ఓడించి 54781 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు .






