1 August, 2026 | 9:18 PM

విద్యుత్ శాఖలో ఆయన సేవలు గణనీయం

01-08-2026 08:39 PM

రైతులకు విద్యుత్ సరఫరాలో విద్యుత్ సమస్యల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించిన ఇన్చార్జి ఏఈఈ

ఇంచార్జ్ నుండి ఏ ఈఈగా పదోన్నతి పొందిన నాగిరెడ్డిపేట ఇంచార్జ్ ఎలక్ట్రిసిటీ ఏఈ నాగరాజు

పదోన్నతిపై వెళ్తున్న ఏఈ నాగరాజు

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల ఇంచార్జ్ విద్యుత్ శాఖ ఏఈఈగా విధులు నిర్వహించిన, నాగరాజుకు పదోన్నతి లభించడం హర్షనీయం.ఇన్చార్జి ఏఈఈగా విధులు నిర్వహించిన, నాగరాజుకు ఏఈఈగా పదోన్నతి లభించడం విద్యశాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పదోన్నతిపై ఏఈ నాగరాజు వెళ్లగా ఆయనను నాగిరెడ్డిపేట మండలంలోనీ బంజర తండ సబ్ స్టేషన్లో  విద్యుత్ శాఖ అధికారులు, లైనింగ్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఈశ్వర్ లైన్మెన్లు ఘనంగా సన్మానించారు.

అనంతరం లైన్స్పెక్టర్ సురేందర్ మాట్లాడుతూ... నాగిరెడ్డిపేట మండలంలో విద్యుత్ శాఖ ఇన్చార్జిగా విధులు నిర్వహించిన నాగరాజు పదోన్నతి లభించడం మాకెంతో సంతోషకరమని బదిలీపై వెళ్తున్న ఏఈఈ నాగరాజ్ విధుల పట్ల ఆయన ఎంతో ఘననీయంగా కొనియాడారు. విధుల్లో ఆటంకం కలగకుండా సంబంధిత శాఖ అధికారులు ఎప్పుడు అప్రమత్తంగా ఉంచేవారని రైతుల పట్ల విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం రాకుండా విధులు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్లు నూర్య,నర్సింలు తదితరులు పాల్గొన్నారు.