8 June, 2026 | 2:14 AM

ఎన్నికల విజయానికి బీఎల్‌ఏలే బలమైన సైన్యం

08-06-2026 12:59 AM

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బూత్ లెవల్ ఏజెంట్లు  కీలక పాత్ర పోషించాలని కేబీ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని రన్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఓటరు జాబితాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, సవరణలపై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిర్పూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తమ ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా కాపాడటం బీఎల్‌ఏల ప్రధాన బాధ్యత అని అన్నారు.

శిక్షణ కార్యక్రమంలో మోహన్, నరేష్ రాథోడ్ ఎన్నికల సంఘం నిబంధనలు, బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమ్డే అనిల్, లెండుగురే శ్యామ్రావు, కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద సంతోష్, కచ్చకాయల జ్యోతి, దుర్గం సూరజ్, పట్టణ అధ్యక్షుడు అల్లాడి రాజు, పలు మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.