27 April, 2026 | 5:16 AM

మండుతున్న ఎండలు.. చుక్కలు చూపిస్తున్న సిగ్నల్ టైమింగ్..

27-04-2026 02:30 AM

సత్తుపల్లి ఏప్రిల్ 26 (విజయక్రాంతి): సత్తుపల్లి రింగ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వేళలపై స్థానికుల నుంచి ఒకటే విన్నపం వినిపిస్తోంది: ‘సార్.. ఈ ఎండల్లో కాస్త సిగ్నల్ టైం తగ్గించండి ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో, రింగ్ సెంటర్ వద్ద రెడ్ సిగ్నల్ పడితే వాహనదారులు అల్లాడిపోతున్నారు.

నిమిషాల తరబడి ఎండలో వేచి ఉండటం నరకప్రాయంగా మారుతోంది. బైక్లపై వెళ్లేవారు చెమటతో తడిసి ముద్దవుతూ, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఈ మండుటెండలో సిగ్నల్ దగ్గర ఆగి ఉండటం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్ టైం ఎక్కువగా ఉండటం వల్ల వేచి ఉండే సమయం భారమవుతోంది. ఇక్కడ ఒక్క నిమిషం నిలబడటమే గగనమైపోతోంది.

సిగ్నల్ సమయాన్ని తగ్గిస్తే మాకు కొంత ఉపశమన కలుగుతుందని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేసన్నారు పిల్లలతో బయటకు రావాలంటేనే భయమేస్తోంది. సిగ్నల్ దగ్గర ఎక్కువ సేపు ఆగాల్సి రావడంతో ఎండ తీవ్రతకు పిల్లలు నీరసించిపోతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ ముఖ్యం అనడంలో సందేహం లేదు. కానీ, ప్రస్తుత అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ క్రింది చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు:ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో సిగ్నల్ సమయాన్ని తగ్గించాలి. ఇది కేవలం ట్రాఫిక్ సమస్య మాత్రమే కాదు.. ప్రజల ఆరోగ్యం మరియు సౌకర్యానికి సంబంధించిన విషయం. అధికారులు స్పందించి చేసే ఆ చిన్న మార్పు, వేలాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది.