27 April, 2026 | 5:10 AM

రూ.10కి కర్రీ ఇవ్వలేదని తల్వార్‌తో దాడి

27-04-2026 02:30 AM
  1. అన్నాదమ్ములకు తీవ్రగాయాలు
  2. పరారీలో నిందితుడు

అమీన్‌పూర్, ఏప్రిల్ 26(విజయక్రాంతి): పది రూపాయలకు కర్రీ ఇవ్వ లేదన్న అక్కసుతో ఓ వ్యక్తి తల్వార్‌తో దాడి చేయగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. పో లీసుల కథనం ప్రకారం అమీన్‌పూర్ మండలం బీరంగూడ తహసీల్దార్ కా ర్యాలయం ఎదురుగా ఉన్న ఓం శ్రీసా యి కర్రీ పాయింట్ వద్దకు స్థానిక అం బేద్కర్ కాలనీకి చెందిన జీవరత్నం అనే వ్యక్తి వచ్చి రూ.10 లకు కర్రీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

అయితే కర్రీ పాయింట్లో పనిచేసే ఉదయ్, అజయ్ అనే అన్నదమ్ములు రూ.30లకు మా త్రమే ఇస్తామని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీంతో ఆగ్రహంతో జీవరత్నం బయటకు వెళ్ళి కొద్దిసేపటి తర్వాత తల్వార్‌తో తిరిగి వచ్చి ఉదయ్, అజయ్ అనే వ్యక్తులపై దాడికి పాల్పడ్డాడు.

ఈ దాడిలో అన్నదమ్ములిద్దరి తలకు తీవ్ర గాయాల య్యాయి. స్థానికులు గుమిగూడడంతో నిందితుడు జీవరత్నం అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ఇద్దరిని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జీవరత్నంపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.