బ్లీచింగ్ పౌడర్ అధికమై చేపలు మృత్యువాత
26-05-2024 12:35 AM
విలువ రూ.10 లక్షలు
సూర్యాపేట జిల్లా గుండ్లకుంట చెరువులో ఘటన
మృతిచెందిన చేపలను చూపుతున్న మత్స్యకారుడు
సూర్యాపేట, మే 25 (విజయక్రాంతి): చేపలు పట్టేందుకు చెరువులో అధిక మోతాదులో బ్లీచింగ్‌పౌడర్ చల్లడంతో రూ.10 లక్ష ల విలువైన చేపలు మృతిచెందాయి. ఈ ఘటన శనివారం సూర్యాపేట శివారులో వెలుగుచూసింది. మత్స్యకారులు తెలిపిన విరాల ప్రకారం.. కుడకుడ గుండ్లకుంట చెరువులో చేపలు పెంచేందుకు రెండేళ్ల క్రితం షేక్ ఖలీల్, జహీర్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. మరో పదిరోజుల్లో వారి కాంట్రాక్ట్ పూర్తి కానున్న నేపథ్యంలో శుక్రవారం చెరువులో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. దీంతో 10 టన్నుల చేపలు మృతిచెందాయని ఆవేదన వ్యక్తంచేశారు.






