కారును ఢీకొన్న లారీ: తండ్రి ముందే కొడుకు మృతి
25-05-2024 03:49 PM
మేడ్చల్ మల్కాజిగిరి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కుమారుడికి వాంతులు అవుతుండటంతో తండ్రి కారు పక్కకు ఆపాడు. వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. మృతుడిని పూజిత్ రామ్(16)గా గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృదదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. తండ్రి కళ్ల ముందే కొడుకు చనిపోవడాన్ని చూసిన ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.






