13 May, 2026 | 12:56 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి

10-01-2025 12:05 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు(Formula E-Race Case)కు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి(Former HMDA Chief Engineer BLN Reddy) శుక్రవారం అవినీతి నిరోధక బ్యూరో(Anti-Corruption Bureau) విచారణకు హాజరయ్యారు. హెచ్‌ఎండీఏ(HMDA) ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో బీఎల్‌ఎన్ రెడ్డిని నిందితుల్లో ఏ3గా చేర్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR), ఐఎఎస్ అధికారి అరవింద్‌ కుమార్(IAS officer Arvind Kumar)లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తన ఆదేశాల మేరకు నిధులను విదేశీ సంస్థకు బదిలీ చేసినట్లు కెటి రామారావు పేర్కొన్నట్లు సమాచారం.