13 May, 2026 | 1:40 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ

13-05-2026 12:08 PM

భిక్కనూర్, మే14(విజయ క్రాంతి): భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలోని కంచర్ల, మల్లుపల్లి, పెద్దమల్లారెడ్డి వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు, కార్మికులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వడగాలులు, వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తగినంత నీరు తాగాలని, ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు