3 July, 2026 | 11:57 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం

13-05-2026 11:18 AM

దమ్మపేట, (విజయక్రాంతి):  రేపు సాయంత్రం అశ్వారావుపేట పట్టణ సమీపంలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతారని, మంత్రి తుమ్మల తో పాటు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఆయిల్ షెడ్ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారనీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి రైతులు భారీ ఎత్తున హాజరుకానున్నారనీ, తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ పంటను విస్తరించాలని లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ, 14వ తేదీన సాయంత్రం అశ్వరావుపేట సమీపంలో జరిగే ఈ రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశానికి అధికారులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పామాయిల్ రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయిల్  ఫెడ్ అధికారులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు సమాచారం అందించారు.