4 July, 2026 | 1:47 AM

సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె

13-05-2026 12:07 PM

దమ్మపేట, మే 13 (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులతో కలసి నూతన బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. సత్తుపల్లి బస్ డిపో ఆధ్వర్యంలో నడిచే ఈ పల్లెవెలుగు బస్ సర్వీస్ సత్తుపల్లి నుండి నాగుపల్లి, గండుగులపల్లి, బాలరాజుగూడెం, జగ్గారం మీదుగా అంకంపాలెం వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. దీంతో ఇప్పటి వరకు మహాలక్ష్మి ఫ్రీ బస్ సౌకర్యానికి నోచుకోని గిరిజన గ్రామాల మహిళల కు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినట్లయింది.