18 August, 2026 | 10:55 AM

ఇసుక తరలింపు అడ్డగింత

24-05-2024 12:44 AM

రాజన్న సిరిసిల్ల, మే 23, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరా వుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని ఇసుక రీచ్‌లో గురువారం గ్రామస్తులు ఇసుక తోలకాలను అడ్డుకున్నారు. మూలవాగు నుంచి కొందరు ఇష్టా రీతిన ఇసుకను తరలిస్తున్నారని, డ్రైవర్లు అతివేగంగా వాహనాలు నడుపుతుండడంతో  ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చేపట్టారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పం దించి తమ గ్రామంలో ఇసుక రీచ్‌ను తీసివేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూశాఖ అధికారులు రీచ్‌కు వచ్చి గ్రామస్తులతో చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.