calender_icon.png 2 November, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే

01-11-2025 06:42:55 PM

నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు: అభివృద్ధి సంక్షేమాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పని చేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ డివిజన్ పరిధిలోని వినోబా నగర్, సాయి రామ్ నగర్, సీతానగర్ కాలనీలలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరు గ్యారెంటీల అమలు చేస్తూ ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. జనాభా ప్రతిపాదికన రాజకీయ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో బీసీ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలను ప్రోత్సహిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బిజెపి పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ను బరిలో నిలిపిందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తట్టుకోలేక అడ్డంకులు సృష్టించిన బీఆర్ఎస్ బిజెపి పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ బిడ్డ నవీన్ కు టికెట్ ఇస్తే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల రాజకీయ కుట్రలను తట్టుకోవాలంటే బీసీలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. బీసీలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు తగిన గుణపాఠం నేర్పాలంటే నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు మురారి గాంధీ, బాలకృష్ణ, విగ్నేష్, బాబురావు, సతీష్ యాదవ్, ప్రదీప్ గౌడ్, రామకృష్ణ, ధనరాజ్, గోవర్ధన్, ఓంకార్, సేవాదళ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, ఎన్ఎంఆర్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.