3 August, 2026 | 2:19 AM

ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

03-08-2026 12:49 AM

బోధన్, ఆగస్టు 2 (విజయక్రాంతి): బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం బోధన్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రక్తదానం అనేది అత్యున్నతమైన సేవా కార్యక్రమమని, ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానంగా మారుతుందని అన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటూ, ఆయన ప్రజలకు మరింత కాలం సేవలందిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.