ఎర్రుపాలెం మోడ్రన్ కబడ్డీ కమిటీ ఎన్నిక
03-08-2026 12:48 AM
ఎర్రుపాలెం ఆగస్టు 2 (విజయక్రాంతి): మధిర ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మోడ్రన్ కబడ్డీ కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో మోడ్రన్ కబడ్డీ జిల్లా చైర్మన్ దేవరాజు, జిల్లా సెక్రెటరీ ఈ రంగారావు, ట్రెజరర్ కృష్ణ ఆధ్వర్యంలో మధిర మండల, ఎర్రుపాలెం మోడ్రన్ కబడ్డీ కమిటీని ఎన్నుకున్నారు. ఎర్రుపాలెం మండల అధ్యక్షుడిగా కుడుముల మల్లికార్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భూక్య గోపి, ఉపాధ్యక్షులు జి గోపయ్య, సహాయ కార్యదర్శిగా వేణు,ట్రెజరర్ ఎస్.కె జహీరా, సభ్యులుగా శీలం బాలకృష్ణారెడ్డి, బి మహేష్ , ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.






