6 May, 2026 | 8:43 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు

06-05-2026 08:08 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం చేసిన యువత, నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ప్రతిఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటం అలవాటు చేసుకోవాలన్నారు. రక్తదానం చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని కాపాడటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదన్నారు. తొలుత నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్‌చేసి సంబరాలు నిర్వహించారు.