బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు
06-05-2026 08:07 PM
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
జవహర్ నగర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పూడూరి చందర్ మృతి పార్టీకి తీరని లోటని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గత కొంత కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న పూడూరి చందర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. పాపయ్యకాలనీ వ్యవస్థాపించి వేలాది మంది కార్మికులకు గూడు కల్పించిన గొప్ప మనసున్న వ్యక్తి అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కార్యకర్తలకు అండగా నిలిచాడని గుర్తు చేశాడు. చందర్ ఆత్మకు శాంతి చూకూరుతూ, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీఅధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు రాజశేఖర్, పార్టీ నాయకులుచందర్ మృతదేహానికి నివాళి అర్పించారు.






