శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి
29-07-2026 09:46 PM
నర్సాపూర్,(హత్నూర): గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి హత్నూర మండలంలోని మధుర గ్రామంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన ఆయన రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సుభిక్షం కలగాలని ప్రార్థించారు. గురుపౌర్ణమి ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని గుర్తుచేసుకుంటూ గురువుల ఆశీస్సులు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






