బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ
29-07-2026 09:43 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో వార్డెన్ రవి నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు అవసరమైన ప్లేట్లు, నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యత అని సర్పంచ్ తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షిస్తూ, అవసరమైనప్పుడు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






