14-11-2025 12:00:00 AM
ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): వరంగల్‌లోని బస్టాండు ప్రాంతం లో శుక్రవారం పడవ ప్రయాణాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ప్రారంభించారు. చారిత్రక నగరమైన వరంగల్‌కు బస్టాండ్ నిర్మాణానికి ఒక్క అడుగు ముం దుకు పడకపోవడంతో వరంగల్ ఆత్మగౌరవ పోరాటం మహాధర్నా 2 పేరుతో వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులకు ఉచిత పడవ ప్రయాణం పేరి ట నిరసన చేపట్టామన్నారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవం త్‌రె డ్డికి, మంత్రి కొండా సురేఖ, మాజీ సీఎం కేసీఆర్‌కు ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రజలు బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లులో బస్టాండ్ లేకపోవ డం సిగ్గుచేటు. కాంట్రాక్టర్లు కమిషన్లపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి మీద లేదు. బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం, ప్రమాద స్థాయి లో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మి ంగ్ ఫుల్ లా మారింది’ అని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే వరంగల్ బస్టాండ్ పేరుతో నయవంచన చేస్తే.. ప్రస్తుత ఎమ్మె ల్యే, మం త్రి కొండా సురేఖ అసమర్థతతో బస్టాండ్ నిర్మాణానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ను తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సర్కారు.. కనీసం వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులను చేపట్టడం లేదం టూ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కొండా సురే ఖ మంత్రిగా ఉన్నా.. పట్టించుకోకపోవడం ఆమె అసమర్థతకు నిదర్శనమని విమ ర్శిం చారు.
ఎన్నికల ముందు అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోట్ల రూపాయలతో కొత్త బస్టాండ్ నిర్మిస్తామం టూ ఇదిగో.. నమూనా బస్టాండ్ అంటూ మాయమాటలు చెప్పి ఉన్నదానిని కూల్చాడని మండిపడ్డారు. ఆ తర్వాత కనీసం అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు ఒక్కఅడుగు ముందుకు పడకపోయినా ఇక్కడి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల భూముల్ని కబ్జా చేయడంలో.. సెటిల్మెంట్ పనుల్లో ఆ పార్టీల నేత లు బీజీబిజీగా ఉన్నారని, ఇక వారికి ప్రజా సమస్యలు ఏం పడతాయంటూ ఆరోపించా రు. ఓరుగల్లు అభివృద్ధి కోసం ఇక ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉమ్మడి జిల్లా మంత్రు ల, శాసనసభ్యుల ఇండ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర బెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, రంజిత్ రావు పాల్గొన్నారు.