14-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, నవంబర్ 13: పేదల గృహ నిర్మాణాలు వేగంగా నిర్మించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని ఎక్వాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కలగాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ఏఎంసీ మార్కెట్ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్థులు,అధికారులు పాల్గొన్నారు.